Telangana Caretaker CM K Chandrasekhar Rao suggested people that should vote TRS candidates.
#kcr
#ktr
#trs
#congress
#harishrao
#tdp
#chandrababu
#telanganaelections2018
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సోమవారం కామారెడ్డి, నిజామాబాద్‌లలో జరిగిన ప్రచార బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. హైదరాబాదును తాను నిర్మించానని చంద్రబాబు చెప్పారని, అలా అయితే కులీకుతుబ్ షా ఎక్కడకు పోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. జెండాలను, పార్టీలను చూసి ఆగం కావొద్దని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాల్సి ఉందని చెప్పారు. తిరగబడి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవన్నారు.